- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగర్ కర్నూలు కలెక్టర్‌పై బదిలీ వేటు
<p>దిశ, న్యూస్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదివారం బదిలీ చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం ఆశించిన తీరులో నిర్వర్తించలేకపోయారనే కారణంతో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్‌ను బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఉన్న షేక్ యాస్మిన్ బాషకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అదికారి […]</p>
దిశ, న్యూస్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదివారం బదిలీ చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం ఆశించిన తీరులో నిర్వర్తించలేకపోయారనే కారణంతో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్‌ను బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఉన్న షేక్ యాస్మిన్ బాషకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అదికారి చిత్రా రామచంద్రన్‌ను కూడా ఆ శాఖ నుంచి తప్పించి కేవలం విద్యాశాఖకు మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సునీల్ కుమార్‌కు గృహనిర్మాణ శాఖ బాధ్యతలను అదనపు హోదాతో అప్పగించారు.
Next Story






