దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే బొంద పెడతాం: నాగం

by  |
దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే బొంద పెడతాం: నాగం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులను కాపాడటంతో ప్రభుత్వం విఫలమైందని, పోతిరెడ్డిపాడుపై టీఆర్ఎస్‌కు స్పష్టత లేదని నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున నీళ్లు దోచుకుపోతున్నాసీఎం కేసీఆర్ కిమ్మనడం లేదని, దీనిలో రహస్యం ఏంటని ప్రశ్నించారు. టీపీసీసీ పోతిరెడ్డిపాడు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ నాగం మాట్లాడుతూ కృష్ణా జలాల అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం, సంగమేశ్వరం లిఫ్ట్ నిర్మాణాలతో దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తుందన్నారు. కేఆర్ఎంబీ సబ్ కమిటీ నివేదిక ప్రకారం పాత హెడ్ రెగ్యులేటర్ ద్వారా 70 వేల కూసెక్కులు పోతున్నాయన్నారు.

ఏపీ ప్రభుత్వం 101 టీఎంసీ మాత్రమే తీసుకోవాలని, కానీ ఇప్పటికే రోజుకు 4 టీఎంసీల చొప్పున 120 టీఎంసీలను తీసుకుపోతున్నారని నాగం వివరించారు. పోతిరెడ్డిపాడు పాత హెడ్ రేగ్యులేటర్‌ను ఇప్పటివరకూ ఎందుకు మూత పెట్టలేదని నాగం ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ప్రతి ఏటా న్యాయంగా రావాల్సిన నీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు సీఎంలు కలిసి, మాట్లాడుకుని నీళ్ల దోపిడి చేస్తున్నారని, ఏపీ జారీ చేసిన 203 జీవోను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఎం కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే బొంద పెడ్తామని, త్వరలో కమిటీ సమావేశమై మాట్లాడుకుంటుందని నాగం వెల్లడించారు.

మన దగ్గర ప్రాజెక్టుల సామర్ధ్యం తగ్గుతున్నాయని కమిటీ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో నీటి దోపిడీ ఎక్కువ అయ్యిందని, కేఆర్ఎంబీ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారన్నారు.లక్ష్మీదేవిపల్లి జలాశయం 21టీఎంసీల నుంచి చివరకు ఒక్క టీఎంసీకి కుదించారన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్ మంత్రులు వేడుక చూస్తున్నారని మండిపడ్డారు.



Next Story

Most Viewed