- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిసెంబర్ 1 నుంచి అతిపెద్ద పండుగ.. సర్కార్ గ్రీన్ సిగ్నల్
<p>దిశ, ఫీచర్స్: ప్రపంచ ప్రఖ్యాత ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’కు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. నాగాలాండ్‌లోని అనేక తెగల సుసంపన్న, విభిన్నమైన సంస్కృతిని చాటి చెప్పే ఈ ఫెస్టివల్.. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. ఆ రాష్ట్రంలోని అనేక తెగల ప్రజలు కలిసిమెలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం వల్లే దీనికి ‘ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్’ అనే పేరొచ్చింది. నాగ గిరిజనుల ఆహార్యం, కళలు, జీవితం, ఆచారాన్ని ప్రతిబింబించే ఈ […]</p>

దిశ, ఫీచర్స్: ప్రపంచ ప్రఖ్యాత ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’కు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. నాగాలాండ్‌లోని అనేక తెగల సుసంపన్న, విభిన్నమైన సంస్కృతిని చాటి చెప్పే ఈ ఫెస్టివల్.. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. ఆ రాష్ట్రంలోని అనేక తెగల ప్రజలు కలిసిమెలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం వల్లే దీనికి ‘ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్’ అనే పేరొచ్చింది. నాగ గిరిజనుల ఆహార్యం, కళలు, జీవితం, ఆచారాన్ని ప్రతిబింబించే ఈ పండుగ గతేడాది కొవిడ్ కారణంగా వర్చువల్‌గా జరగగా, ఈసారి మాత్రం నాగాలాండ్ ప్రభుత్వం ఘనంగా జరపనుంది.
ఈ మేరకు అక్టోబర్ 1న కోహిమాలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని అన్ని గిరిజన సంస్థలను నాగాలాండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఆహ్వానించింది. హార్న్ బిల్ ఫెస్టివల్ ఎలా జరపాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనుంది. ఇప్పటి వరకు, పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులను మాత్రమే నాగాలాండ్‌లోకి అనుమతిస్తుండగా, ఫెస్టివల్ చేపడితే ఇదే రూల్ పెట్టాలా? వద్దా? డిస్కస్ చేయనున్నారు. కాగా, తమ తల పాగాలకు హార్న్ బిల్ అనే పక్షి ఈకలు ధరించే నాగాలు.. ఈ పక్షిని గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు రాష్ట్రంలోని చాలా గిరిజనుల జానపద కథల్లో దాని ప్రస్తావన ఉండటం విశేషం.
ఈ ఉత్సవాల్లో సంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శించడంతోపాటు నాగ యుద్ధ వీరులను అభినందిస్తూ అనేక పాటలు పాడతారు. చేతి కళలు, ఆటలు, క్రీడలు, ఫుడ్ ఫెయిర్స్ అక్కడ కొలువుతీరుతాయి. బ్యూటీ కాంటెస్ట్, ఫ్యాషన్ షోస్, నాగ రెజ్లింగ్, ఫ్లవర్ షోస్ కూడా నిర్వహిస్తారు. ఇక హార్న్‌బిల్ రాక్ కన్సర్ట్‌లో విదేశీ బ్యాండ్‌లతో స్వదేశీ బ్యాండ్స్ పోటీపడుతాయి. ఈ అద్భుతమైన ఈవెంట్ తరువాత నైట్ మార్కెట్ ఉంటుంది. పండుగలో ప్రదర్శించే చాలా ఆచారాలు వ్యవసాయం చుట్టూ తిరుగుతాయి. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 85% ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
2019లో 10 రోజుల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య ప్రాంతంలో ఇది అతిపెద్ద పండగ కావడంతో దాదాపు మూడు లక్షలకు పైగా సందర్శకులు ఇక్కడకు వస్తుంటారని అంచనా. రాష్ట్రంలోని మొత్తం 18 తెగలు ప్రతి ఏడాది ఈ మెగా పండుగలో పాల్గొని వారి సాంస్కృతిక మరియు సాంప్రదాయ ఆడంబరాలను ప్రదర్శిస్తున్నాయి. నాగాలాండ్ డిసెంబర్ 1, 1963న రాష్ట్ర హోదాను పొందింది. ఏటా నాగాలాండ్ వాసులు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి సమానంగా హార్న్‌బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. కొహిమా సమీపంలో ఉన్న కిసామా వారసత్వ గ్రామంలోనే ఈ వేడుకలు జరుగుతాయి.






