త్రీ గెటప్స్‌లో చైతు!

by  |
త్రీ గెటప్స్‌లో చైతు!
X

అక్కినేని వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ చైతన్య.. ‘మజిలీ’ సినిమాతో కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్న చైతు.. మరో సూపర్ హిట్ అందుకుంటాననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వీడియో సాంగ్‌లో చైతు పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.

ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’తో సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్‌తో మరో సినిమా చేస్తున్నాడు చైతు. స్టోరీ లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో.. ఫస్ట్ టైమ్ మూడు గెటప్స్‌తో ఎక్స్‌పరిమెంట్ చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న సినిమాకు ‘థాంక్ యూ’ టైటిల్ పరిశీలనలో ఉండగా.. హీరోయిన్‌గా రకుల్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉందని టాక్.


Next Story

Most Viewed