శౌర్యకు చాన్సిచ్చిన దర్శకేంద్రుడు

by  |
శౌర్యకు చాన్సిచ్చిన దర్శకేంద్రుడు
X

శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్ర రావుది తెలుగు సినీ చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయం. తెలుగువారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన ఆయన కొంత కాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరగా ఆయన నాగార్జునతో ఓం నమోవెంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే గతేడాది ముగ్గురు దర్శకులు, ముగ్గురు కథానాయికలతో సినిమా తీస్తానని ప్రకటించిన రాఘవేంద్ర రావు.. తాజాగా దీనిపై స్పందించారు. కచ్చితంగా ఆ సినిమాను మీ ముందుకు తెస్తానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఆయన అలా ప్రకటించారో లేదో .. ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి అప్‌డేట్స్ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్యకు అవకాశం దక్కినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇన్నోసెంట్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సూటయ్యే శౌర్య.. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే శౌర్య లేక కేఆర్ స్పందించాల్సిందే.



Next Story

Most Viewed