‘లాల్ సింగ్ చద్దా ’ షూటింగ్‌లో అక్కినేని వారసుడు

by  |
‘లాల్ సింగ్ చద్దా ’ షూటింగ్‌లో అక్కినేని వారసుడు
X

దిశ, సినిమా : మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ ప్రాజెక్ట్‌లో అక్కినేని వారసుడు నాగచైతన్య జాయిన్ అవుతాడని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు ఈ న్యూస్‌ను నిజం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు చైతన్య. గతవారం లడఖ్‌లో ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన చైతు.. అమీర్, కిరణ్ రావ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. సినిమాలో తన క్యారెక్టర్ పేరు ‘బాలా’ అని రివీల్ చేస్తూ, ఈ అవకాశం దక్కడం పట్ల గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నానని తెలిపాడు. ప్రస్తుతం క్రూషియల్ వార్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నట్టు తెలిపిన మేకర్స్.. మరో 45 రోజుల పాటు షెడ్యూల్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

అద్వైత్ చందన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కరీనా కపూర్ ఫిమేల్ లీడ్ ప్లే చేస్తుండగా.. డిసెంబర్‌లో మూవీ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ముందుగా ‘బాలా’ పాత్ర కోసం సౌత్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంచుకున్నప్పటికీ.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. 1994 హాలీవుడ్ డ్రామా ‘ఫారెస్ట్ గంప్’ ఇండియన్ అడాప్టేషన్‌గా వస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పాత్రలో కనిపించబోతున్న చైతు.. ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.



Next Story

Most Viewed