విడిపోయినా.. సమంత అడుగుజాడల్లోనే చైతన్య.. మనసు మార్చుకున్నాడా..?

by  |
విడిపోయినా.. సమంత అడుగుజాడల్లోనే చైతన్య.. మనసు మార్చుకున్నాడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చై కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’ నేడు విడుదల అయ్యి డీసెంట్ ఫిల్మ్ గా పాజిటివ్ టాక్ ని తెచ్చుకొంటుంది.. ఇకపోతే ఈ చిత్రం తర్వాత చై లైన్ అప్ ఆసక్తికరంగా మారింది. సినిమాల విషయంలో చైతన్య, సమంతను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందించిన ఈ సిరీస్ లో సామ్ నెగిటివ్ రోల్ లో నటించి అదరగొట్టేసింది. ప్రస్తుతం చై సైతం సామ్ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు.

‘లవ్ స్టోరీ’ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న అక్కినేని వారబ్బాయి.. ఈ సినిమా పూర్తిచేసిన తరువాత ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం నాగచైతన్య ఓ హర్రర్ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యారు. చైతన్యకు హర్రర్ చిత్రాలు చూడడానికే భయమని సామ్ ఒకానొక ఇంటర్వ్యూ లో చెప్పింది.. అయితే ఇప్పుడు అలాంటి హర్రర్ చిత్రంలోనే చై నటిస్తున్నాను అని అఫీషియల్ గా చెప్పడం చర్చానీయాంశంగా మారింది. చైతన్య కూడా ఒకపక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ భార్య సామ్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిలోనే కాకూండా మరో విషయంలోనూ సామ్ నే ఫాలో అవుతున్నాడు చై. ‘ఫ్యామిలీ మ్యాన్’ లో సామ్ నెగెటివ్ రోల్ చేసి మెప్పించగా.. ఈ హర్రర్ సిరీస్ లో చై నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడట. మారుతున్న ట్రెండ్ ని బట్టి చై కూడా మనసు మార్చుకున్నాడా..? అన్ని పాత్రలకు తాను తగినవాడని రుజువు చేయడానికే విలన్ రోల్ చేస్తున్నాడా..? అని అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇక ఈ సిరీస్ ని కూడా విక్రమ్ కె కుమార్ యే తెరకెక్కించనున్నాడట. ఏదిఏమైనా చై, సామ్ ని ఫాలో అయ్యి విజయాలను అందుకుంటాడేమో చూడాలి.

Next Story

Most Viewed