ప్రకాశ్‌రాజ్ జాగ్రత్తగా మాట్లాడు : నాగబాబు

by  |
ప్రకాశ్‌రాజ్ జాగ్రత్తగా మాట్లాడు : నాగబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూటకు ఓ మాట మారుస్తున్నారని.. ఆయన ఓ ఊసరవెల్లి అంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. పవన్ సోదరుడు నాగబాబు ప్రకాశ్‌ రాజ్‌ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఏమి చేసినా తప్పు అనడం సరికాదన్నారు. దేశానికి అభివృద్ధి బీజేపీ, జనసేనతోనే సాధ్యమవుతోందని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు ఎంతవాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరని.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నాగబాబు హెచ్చరించారు.

Next Story

Most Viewed