బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు

by  |
Naga Babu, Balakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘మా’ సేకరించిన విరాళాలు సినీ కార్మికుల సంక్షేమం కోసమే అని, భవనం నిర్మించడానికి కాదు అని నాగబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత ‘మా’ ఎన్నికల్లో అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారని అన్నారు. ‘మా’కు సొంత భవనం కోసం మురళీ మోహన్ ఎంతో ప్రయత్నించారని గుర్తుచేశారు. రాజకీయ కారణాలతో అప్పటి అధ్యక్షుడి ప్రయత్నం సఫలం కాలేదని అన్నారు. ఆయన తర్వాత వచ్చినవాళ్లూ భవనం కోసమే ప్రయత్నాలు చేశారని వెల్లడించారు. భవన నిర్మాణం విషయంలో ప్రకాశ్ రాజ్‌కు ఒక విజన్ ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే తాను ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. ఏకగ్రీవంపై మంచు విష్ణు ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదు, ఏకగ్రీవం చేయాలనుకుంటే ప్రకాశ్‌రాజ్‌నే అధ్యక్షుడ్ని చేయాలని సూచించారు.

కాగా, ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోను అని గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ… ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు అని నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారు. తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా? ‘మా’ శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చాడని, నేనూ అందులో భాగస్వామినవుతా. అంతేకాదు అందరం కలిస్తే ‘మా’ కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చు.’’ అని బాలయ్య ‘మా’ సమస్యల్ని బహిరంగంగా చర్చించారు.

Next Story

Most Viewed