- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడా .. ఈ జనాలు మారరా? : నాగబాబు
<p>దిశ, వెబ్‌డెస్క్: నటుడు, జనసేన నాయకుడు నాగబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. వైసీపీకి పట్టం కట్టి జనసేనకు ఢోకా చేశారంటూ ఇంతకు ముందు కూడా విమర్శించిన మెగా బ్రదర్… మరో సారి అదే తరహాలో కామెంట్ చేశాడు. ఏపీ జనాన్ని చూస్తే పాపం అనిపిస్తుందంటూ ట్వీట్ చేశాడు. లైఫ్ ఇస్తానన్నవాడిని ఓడిస్తారు.. లైఫ్ తీసుకునే వాళ్లని అధికార ప్రతిపక్షాలుగా ఎన్నుకుంటారు… ఏమిటో ఈ జనం.. దేవుడా ఈ జనాల మనుసు మార్చు అంటూ కోరుకున్నాడు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, జనసేన నాయకుడు నాగబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. వైసీపీకి పట్టం కట్టి జనసేనకు ఢోకా చేశారంటూ ఇంతకు ముందు కూడా విమర్శించిన మెగా బ్రదర్… మరో సారి అదే తరహాలో కామెంట్ చేశాడు. ఏపీ జనాన్ని చూస్తే పాపం అనిపిస్తుందంటూ ట్వీట్ చేశాడు. లైఫ్ ఇస్తానన్నవాడిని ఓడిస్తారు.. లైఫ్ తీసుకునే వాళ్లని అధికార ప్రతిపక్షాలుగా ఎన్నుకుంటారు… ఏమిటో ఈ జనం.. దేవుడా ఈ జనాల మనుసు మార్చు అంటూ కోరుకున్నాడు. ఫ్యూచర్ జనరేషన్ అయినా బాగా ఆలోచించి .. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని అభిప్రాయపడ్డాడు.
నాగబాబు కామెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనానికి సినిమాలను ఆదరించడంలో ఉన్న స్పష్టత రాజకీయ నాయకులను ఎన్నుకోవడంలో లేదని కొందరు చెబుతుంటే.. అందరూ లైఫ్ ఇస్తామనే వస్తారు… తర్వాత లైఫ్ తీసుకునే వారిగానే సెటిల్ అయిపోతారని మరికొందరు సెటైర్ వేస్తున్నారు. జనసేన గెలిస్తే జనాలు మంచివాళ్లు లేదంటే చెడ్డవారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Tags: Naga Babu, Politician, Janasena, Voter, AP People






