ఆరోజు నాటికి పనులన్నీ పూర్తికావాలి : సీఎం జగన్

by  |
cm ys jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించబోతునున్నట్లు సీఎం జగన్ మరోసారి స్పష్టంచేశారు. పాఠశాలల్లో నిర్వహించే నాడు-నేడు కార్యక్రమం పై మంగళవారం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్కూళ్లు తెరిచే నాటికి నాడు-నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూళ్లు తెరిచే రోజున విద్యార్థులకు ఇవ్వనున్న ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌ను జగన్ పరిశీలించారు.

పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌ క్లాత్‌ అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం‌.. వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టంచేశారు. అలాగే సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా అన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 5న పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మొదటి దశ నాడు-నేడు పనులు దాదాపుగా పూర్తయ్యాయని ఆయన వివరించారు. కాగా, నాడు-నేడు మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలను బాగు చేయనుండగా.. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు.



Next Story

Most Viewed