- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈటల’ను ఓడించడమే నా ధ్యేయం
<p>దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజవర్గంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈటల రాజేందర్‌ను ఓడించడమే తన ధ్యేయమని మాజీ జడ్పీటీసీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత అరుకాల వీరేశలింగం అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రాజేందర్ తన అక్రమ ఆస్తులను, భూములను కాపాడుకునేందుకే బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుని బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. ఎట్టి […]</p>

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజవర్గంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈటల రాజేందర్‌ను ఓడించడమే తన ధ్యేయమని మాజీ జడ్పీటీసీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత అరుకాల వీరేశలింగం అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రాజేందర్ తన అక్రమ ఆస్తులను, భూములను కాపాడుకునేందుకే బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుని బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను గెలవనివ్వబోమని వీరేశలింగం స్పష్టం చేశారు. గత 17 ఏళ్లుగా నియోజకవర్గంలో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రస్తుతం ప్రజలు వాస్తవం తెలుసుకునే స్థితిలో లేరన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు ఈటల వలన న్యాయం జరగకపోగా, ఎవరినీ రాజకీయంగా ఎదగనీయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో తాను జడ్పీటీసీగా ఉన్నప్పటికీ నన్ను అవమానపరిచి పార్టీ నుండి బయటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.






