- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో చేపలు పడితే.. చంపేశారా..?
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చేపల వేట కోసం చెరువుకు వెళ్లిన యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం చెరువులో చేపల వేటకు వెళ్లిన సంకీర్త్ (21) ను మత్స్యకారులు పట్టుకున్నట్టు తెలిసింది. సోసైటీకి చెందిన చెరువులో చేపలు పట్టినందుకు 20వేల జరిమాన విధించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ శనివారం ఉదయం రైలు పట్టాల వద్ద సంకీర్త్ మృతదేహం లభ్యమైంది. గంగపుత్రులే […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చేపల వేట కోసం చెరువుకు వెళ్లిన యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం చెరువులో చేపల వేటకు వెళ్లిన సంకీర్త్ (21) ను మత్స్యకారులు పట్టుకున్నట్టు తెలిసింది. సోసైటీకి చెందిన చెరువులో చేపలు పట్టినందుకు 20వేల జరిమాన విధించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కానీ శనివారం ఉదయం రైలు పట్టాల వద్ద సంకీర్త్ మృతదేహం లభ్యమైంది. గంగపుత్రులే చెరువులో చేపలు పట్టినందుకు హత్య చేశారని సంకీర్త్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సంకీర్త్ కుటుంబ సభ్యులు నవీపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు నార్త్ రూరల్ సీఐ గురునాథ్ తెలిపారు.
Next Story






