- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్ల పొదల్లో మహిళా మృతదేహం లభ్యం..
<p>దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని వలిబాషా గుట్ట సమీపంలోని చెట్లపొదల్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా మృతురాలు మోట కొండూరు మండలం కాటపల్లికి చెందిన గంధమల్ల శ్రీ వాణిగా గుర్తించారు. అయితే, ఈ నెల 18న వలిగొండకి వచ్చిన శ్రీవాణి కనిపించకుండా పోయింది. దీంతో 19వ తేదీన కుటుంబ సభ్యులు వలిగొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని వలిబాషా గుట్ట సమీపంలోని చెట్లపొదల్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా మృతురాలు మోట కొండూరు మండలం కాటపల్లికి చెందిన గంధమల్ల శ్రీ వాణిగా గుర్తించారు. అయితే, ఈ నెల 18న వలిగొండకి వచ్చిన శ్రీవాణి కనిపించకుండా పోయింది. దీంతో 19వ తేదీన కుటుంబ సభ్యులు వలిగొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది.
ఇదిలాఉండగా, వలిగొండ మండలం గొల్లపల్లికి చెందిన మిర్యాల రవి, కాటపల్లి చెందిన గండమల్ల శ్రీవాణి ప్రేమించుకున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 20న రవి నాగిరెడ్డి పల్లిలోని ముళ్లపొదల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతని మరణానికి అమ్మాయి కుటుంబ సభ్యులే కారణమని రవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాజాగా శ్రీవాణి కూడా చనిపోవడంతో మృతుడు రవి, శ్రీవాణినీ అమ్మాయి తరఫు వారే హత్యచేసి ఉంటారని రవి కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కాగా, శ్రీవాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.






