అప్పు ఇచ్చిన పాపానికి.. కత్తితో మెడ, చేతి నరాలు తెంపాడు

by  |
అప్పు ఇచ్చిన పాపానికి.. కత్తితో మెడ, చేతి నరాలు తెంపాడు
X

దిశ, కరీంనగర్ సిటీ : డబ్బులు అరువు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిపై దారుణంగా కత్తితో దాడి జరిగింది. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి నగరంలో గత కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి బొమ్మకల్ గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్ అనే యువకుడు ఏడాది కిందట రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే, కొద్ది రోజుల కిందట తన అప్పు తిరిగి చెల్లించాలని అడగటంతో తీసుకున్న అప్పు కింద భూమి ఇస్తానంటూ చెప్పి గోలి శ్రీకాంత్‌కు చెప్పాడు.

సోమవారం రిజిస్ట్రేషన్ చేస్తానని, భూమి చూసుకునేందుకు రేకుర్తికి రావాలని చెప్పాడు. తీరా వెళ్లాక విచక్షణా రహితంగా అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు వీక్షించారు. దాడిలో బాధితుడు శ్రీకాంత్ మెడ నరాలు, కుడి చేయి మణికట్టు నరాలు పూర్తిగా తెగిపోయి తీవ్ర రక్తంస్రావం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడు గతంలో కూడా అదే ప్రాంతంలో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.

Next Story

Most Viewed