- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొంచివున్న ముప్పు.. బురదమయమైన కాలనీలు (వీడియో)
<p>దిశ, పెద్డపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు శ్రీరాంనగర్‌కు చెందిన నాయి బ్రాహ్మణ వీధిలో మున్సిపల్ నీటి పైపులు లీక్ అయ్యి కాలనీలోని రోడ్డు జలమయమైంది. దీంతో కాలనీలోని ఇండ్ల ముందు భారీగా వరదనీరు చేరి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యపై కాలనీ వాసులు పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నీటి లీకేజీ మూలగాగి, ఇండ్ల ఎదుట బురదమయమై కాలనీలో ఎలాంటి భకార్యాలు చేసుకోలేని పరిస్థితి […]</p>

దిశ, పెద్డపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు శ్రీరాంనగర్‌కు చెందిన నాయి బ్రాహ్మణ వీధిలో మున్సిపల్ నీటి పైపులు లీక్ అయ్యి కాలనీలోని రోడ్డు జలమయమైంది. దీంతో కాలనీలోని ఇండ్ల ముందు భారీగా వరదనీరు చేరి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యపై కాలనీ వాసులు పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నీటి లీకేజీ మూలగాగి, ఇండ్ల ఎదుట బురదమయమై కాలనీలో ఎలాంటి భకార్యాలు చేసుకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. నిలిచిన బురదనీటిలో దోమలు ఎక్కువై పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే విష జ్వారాల బారినపడ్డ తమ పిల్లల పూర్తి బాధ్యత మున్సిపల్ పాలకులు, అధికారులే వహించాలని హెచ్చరించారు.






