చెత్త బయట పడేస్తున్నారా.. భారీ జరిమానా తప్పదు

by Shyam |   (  Updated:2021-08-14 05:26:34  IST  )

<p>దిశ, సిద్దిపేట : సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు శ్రమిస్తున్నారు. నిరంతరం సిద్ధిపేట ప్రజల కోసం స్వచ్ఛ సిద్దిపేట, గ్రీన్ సిద్దిపేట కావాలని కలలు కంటున్న మంత్రి ఆశయాలకు కొంతమంది గండి కొడుతున్నారు. పట్టణంలో రాత్రి పూట బైపాస్ రోడ్డు శివార్లలో చెత్తను వేస్తూ అపరిశుభ్రంగా చేస్తూ దుర్వాసన వచ్చేలా చేస్తున్నారు. సిద్దిపేట పట్టణ శివారులో రాత్రి సమయంలో చెత్త చెదారం, ఇతర వ్యర్థ పదార్థాలను [&hellip;]</p>

చెత్త బయట పడేస్తున్నారా.. భారీ జరిమానా తప్పదు
X

దిశ, సిద్దిపేట : సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు శ్రమిస్తున్నారు. నిరంతరం సిద్ధిపేట ప్రజల కోసం స్వచ్ఛ సిద్దిపేట, గ్రీన్ సిద్దిపేట కావాలని కలలు కంటున్న మంత్రి ఆశయాలకు కొంతమంది గండి కొడుతున్నారు. పట్టణంలో రాత్రి పూట బైపాస్ రోడ్డు శివార్లలో చెత్తను వేస్తూ అపరిశుభ్రంగా చేస్తూ దుర్వాసన వచ్చేలా చేస్తున్నారు.

సిద్దిపేట పట్టణ శివారులో రాత్రి సమయంలో చెత్త చెదారం, ఇతర వ్యర్థ పదార్థాలను పడవేసే వారిపై మున్సిపల్ సిబ్బంది కొరడా ఝులిపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను నియమించి సిద్దిపేటలోని శివార్లలో రాత్రి పూట, ఉదయం సమయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలు వేసే వారిని పట్టుకొని భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

పట్టణంలోని సీఎన్‌అర్ లేడీస్ హాస్టల్‌కు సంబంధించిన చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలు, హానికరమైన చెత్తను ఆటోలో తీసుకొచ్చి సిద్దిపేటలోని బైపాస్ రోడ్డు శివార్లలో పారవేస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్ఆర్ లేడీస్ హాస్టల్ యజమాని ప్రవీణ్ కుమార్ రెడ్డికి మున్సిపల్ అధికారులు పదిహేను వేల రూపాయలు జరిమానా విధించారు. అలాగే చెత్తను సీఎన్ఆర్ లేడీస్ హాస్టల్ ఆవరణలో వేసి వారి ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేయించి బుస్సపూర్ డంప్ యార్డ్‌కు తరలించారు.

Next Story