- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్: ప్రముఖ ఆలయం మూసివేత
<p>కరోనా మహమ్మారి పెడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు స్కూళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, బార్లు, పబ్ తదితర జన సమ్మర్థక ప్రదేశాలను మూసివేశాయి. ఇప్పుడు దేవుడికి కూడా చిక్కొచ్చి పడింది. దేశంలోనే అత్యధిక కరోన్ వైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని ఈరోజు (సోమవారం) సాయంత్రం నుంచి మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను […]</p>

కరోనా మహమ్మారి పెడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు స్కూళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, బార్లు, పబ్ తదితర జన సమ్మర్థక ప్రదేశాలను మూసివేశాయి. ఇప్పుడు దేవుడికి కూడా చిక్కొచ్చి పడింది. దేశంలోనే అత్యధిక కరోన్ వైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని ఈరోజు (సోమవారం) సాయంత్రం నుంచి మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించరు. రోజువారీ కైంకర్యాలు జరుగుతాయి. కరోనా విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పీటీఐకు తెలిపారు. ఇప్పటికే షిర్డీ, శబరి ఆలయాలు కొన్ని వారాలపాటు భక్తులను దైవ దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరాయి. కరోనా బాధితుల సంఖ్య సోమవారం 116కు చేరుకుంది. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో 50కి మించి ప్రజలు ఒక్క దగ్గర చేరడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Tags : mumbai ssiddhivinayak temple, to close entry for devotees from today, corona effect






