- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంఎస్ ధోనీకి పోలీసుల వినూత్న శుభాకాంక్షలు
<p>దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ మంగళవారం 39వ ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా సహచర క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, సెలెబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ముంబయి పోలీసులు ధోనీకి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దేశమంతా కరోనాతో అతలాకుతలమైంది. అందరూ భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత కలిగి ఉండటం వల్ల కరోనాను దూరం పెట్టవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో […]</p>

దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ మంగళవారం 39వ ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా సహచర క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, సెలెబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ముంబయి పోలీసులు ధోనీకి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దేశమంతా కరోనాతో అతలాకుతలమైంది. అందరూ భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత కలిగి ఉండటం వల్ల కరోనాను దూరం పెట్టవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీని షార్ట్ కట్‌లో పిలిచే ఎంఎస్‌డీకి సరికొత్త అర్థాన్ని చెబుతున్నారు. ఎంఎస్‌డీ అంటే ‘మెయింటెయిన్ సోషల్ డిస్టెన్సింగ్’ అంటూ ముంబయి పోలీసులు ట్వీట్ చేశారు. క్రికెట్ మైదానం, దాని మధ్యలో వికెట్లు, బ్యాటు, బంతి.. వాటితోపాటు ‘ఎంఎస్‌డీ మెయింటెన్ సోషల్ డిస్టెన్సింగ్’ అనే అక్షరాలు ఈ ఫొటోలో కనిపిస్తాయి. కరోనాను జయించాలని, అందుకోసం ధోనీలానే నాట్ అవుట్‌గా ఉండాలని, కరోనా వైరస్‌ను స్టంప్ అవుట్ చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ కెప్టెన్ కూల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ఫొటో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నది.






