మళ్లీ చేతులెత్తేసిన SRH.. రోహిత్ సేనకు మరో గెలుపు

by  |
మళ్లీ చేతులెత్తేసిన SRH.. రోహిత్ సేనకు మరో గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడోసారి ఘోర పరాజయం పాలైంది. SRH బౌలర్లు 20 ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మాన్‌లను 150 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. ఛేదనలో దారుణంగా విఫలమయ్యారు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు. డేవిడ్ వార్నర్ (36), బెయిన్ స్టో (43), విజయ్ శంకర్ (28) పరుగులతో రాణించిన మిగతా బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలదొక్కుకోలేదు. విరాట్ సింగ్ (11) మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ కనీసం 10 పరుగులకు మించి చేయలేకపోయారు. వరుసగా వికెట్లు పారేసుకుంటూ.. చివరి ఓవర్ నాలుగో బంతికే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో 137 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్.. SRHపై విజయం సాధించింది. ముంబై జట్టులో బోల్ట్, రాహుల్ చాహర్ మూడేసి వికెట్లు తీసుకొని జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు.

For Live updates on IPL Score :

  1. KKR Vs RCB : https://www.dishadaily.com/match-detail/series/2780/match/50818/status/upcoming/

  2. DEL Vs KKXI : https://www.dishadaily.com/match-detail/series/2780/match/50819/status/upcoming/

Next Story

Most Viewed