బిగ్ బ్రేకింగ్: పోర్న్ కేసు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అరెస్ట్..?

by  |
బిగ్ బ్రేకింగ్: పోర్న్ కేసు.. బాలీవుడ్  స్టార్ హీరోయిన్  శిల్పాశెట్టి అరెస్ట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి రాజ్ కుంద్రా కేసు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతున్నది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను మూడు రోజుల క్రితం ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ కోసం పోలీసులు ఆయన నివాసాన్ని సెర్చ్ చేయనున్నారు. అంతేకాకుండా భర్త పోర్న్ వీడియో కేసు లో శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందనితెలుస్తున్నది.

శిల్పాశెట్టి వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు కాబట్టి.. ఖచ్చితంగా ఆమెను విచారించి తీరాల్సిందేనని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల, అంధేరి వెస్ట్‌లోని ఓ సంస్థ కార్యాలయంపై క్రైమ్ బ్రాంచ్ దాడి చేయగా పోర్న్ సినిమాలకు సంబంధించిన భారీ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ కేసులో శిల్పాశెట్టి కి సంబంధం ఉందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ రెండు రోజుల విచారణలో రాజ్ కుంద్రా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.



Next Story

Most Viewed