- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల ఎఫెక్ట్.. ముదిరాజ్ సంఘం కీలక నిర్ణయం
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా ముదిరాజ్ సంఘం నిలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు. ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, ముదిరాజ్ మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనకటి ప్రభాకర్, మండల ముదిరాజ్ గౌరవ అధ్యక్షుడు గొడుగు నర్సయ్యలు టీఆర్ఎస్ కు […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా ముదిరాజ్ సంఘం నిలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు. ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, ముదిరాజ్ మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనకటి ప్రభాకర్, మండల ముదిరాజ్ గౌరవ అధ్యక్షుడు గొడుగు నర్సయ్యలు టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈటలపై అధికారపార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే ప్రజాదరణ ఉన్న నేతపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. త్వరలో నిజాలు నిగ్గుతేలతాయని ధీమా వ్యక్తం చేశారు. ముదిరాజ్ సమాజం ఆయనకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని ముదిరాజ్ టీఆర్ఎస్ నాయకులందరూ గులాబీ గూటిని నుంచి బయటికి రావలని పిలుపునిచ్చారు.






