తెగిన వాగు.. నిలిచిన రాకపోకలు

by  |
తెగిన వాగు.. నిలిచిన రాకపోకలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని వాగులు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కురిసిన వార్షానికి వాగు కరకట్ట కోతకు గురవడంతో జిల్లాలోని కేటిదొడ్డి మండలం నందిన్నె వద్దనున్న మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

గత కొంతకాలంగా పాత వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. వాహనాలు బ్రిడ్జిపక్కన ఉన్న మట్టి రోడ్డుపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా కట్ట తెగిపోవడంతో వరద ధాటికి మట్టిరోడ్డు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

Read Also…

అవినీతి అంతానికే రెవె ‘న్యూ’ చట్టం : కేసీఆర్


Next Story

Most Viewed