సెలెక్టర్లు వద్దన్నారు.. జట్టులో అతని స్థానం కోసం ‘మహీ’ మాస్టర్ ప్లాన్..

by  |
సెలెక్టర్లు వద్దన్నారు.. జట్టులో అతని స్థానం కోసం ‘మహీ’ మాస్టర్ ప్లాన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయని హార్దిక్ పాండ్యాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌లో బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్యా‌ను భారత సెలెక్టర్లు పక్కన పెట్టాలని భావించారంట.. కానీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోనీనే పట్టుపట్టి మరీ అతన్ని జట్టులో ఉండేలా చేశాడంట. ఫినిషర్‌గా పాండ్యా జట్టులో ఉండటం కీలకమని మహీ సూచించడంతో సెలెక్టర్లు అతన్ని కొనసాగించారని టైమ్స్ ఇండియా పేర్కొంది.

వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్‌ ముంగిట భారత్ జట్టులోకి సడన్‌గా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ను భారత సెలెక్టర్లు చేర్చారు. అతని కోసం స్పిన్ ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ని ప్రధాన జట్టులో నుంచి తప్పించి.. స్టాండ్ బై‌ ఆటగాళ్ల జాబితాలో చేర్చారు. నిజానికి అక్కడ అక్షర్ పటేల్ స్థానంలో హార్దిక్ పాండ్యాని జట్టులోని నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావించారట. ఐపీఎల్ ముగిసిన వెంటనే యూఏఈ నుంచి పాండ్యాను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారంట. కానీ, ధోనీ ఎంట్రీ ఇచ్చి.. హార్దిక్ పాండ్యా ఫినిషర్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో జట్టుకి ఉపయోగపడతాడని చెప్పినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. దాంతో అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టి శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారని చెప్పాడు.

అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం హార్దిక్ ముమ్మురంగా సిద్దమవుతున్నాడు. మహీ పర్యవేక్షణలో అతను నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ చేసేందుకు హార్దిక్ సిద్దమైనట్లు తెలుస్తోంది. కాగా, మహీ పెట్టుకున్న నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి మరి..



Next Story