నీది సీరియల్ ఫేస్‌.. సినిమాలు అవసరమా?

by  |
Mrunal Thakur
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ప్రాజెక్టుల్లో వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. స్టార్ హీరోల సరసన చాన్స్‌లు కొట్టేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. అయితే ముందుగా సీరియళ్లలో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కు ఎంటరైన మృణాల్.. చాలా నెగెటివ్ కామెంట్స్ చూశానని చెప్పింది. నీ ఫేస్ కేవలం టెలివిజన్‌కు మాత్రమే సరిపోతుందని, సిల్వర్ స్క్రీన్‌కు పనికి రావని మొహం మీదే చెప్పేవారని తెలిపింది. బాలీవుడ్‌కు వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరని డిస్కరేజ్ చేశేవారని, కానీ అలాంటి ఆలోచనను తొలగించేందుకు డిసైడ్ అయ్యానని, తను కూడా సినిమాల్లో నటించేందుకే పుట్టానని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. మూవీ ఆడిషన్స్‌కు వెళ్తే ఇది మీ కోసం కాదు వెళ్లిపోవచ్చని చెప్పేవారని, కేవలం ఒక్క ఆడిషన్ తీసుకోమని చెప్పినా ఒప్పుకునేవారు కాదని చెప్పుకొచ్చింది. ఇలా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా వాటిని పాజిటివ్‌గా తీసుకుని మూవ్ అయ్యానని, అందుకే ఇలా మీముందు కూర్చున్నానని తెలిపింది మృణాల్.



Next Story