టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మాజీ ఎంపీటీసీ

by  |
టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మాజీ ఎంపీటీసీ
X

దిశ, చిగురుమామిడి : టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీటీసీ షాక్ ఇచ్చారు. చిగురుమామిడి మండలం నవాబు పేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు, ప్రస్తుత రైతు సమన్వయ సమితి సభ్యులు బరిగెల వెంకటేశం టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులు టీఆర్ఎస్‌లో లేరన్నారు. తనకు ఉన్న సమస్యలు పార్టీ పెద్దలకు, ఎమ్మెల్యే సతీష్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. స్వార్థపూరిత రాజకీయాల్లో తాను పనిచేయలేనని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని వెంకటేశం పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా చిగురుమామిడి మండల టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా, వెంకటేశం మాదిరిగా తెరాస పార్టీకి ఇంకా కొంతమంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story

Most Viewed