లంచం అడిగి ఏసీబీకి చిక్కాడు

181

దిశ, కొత్తగూడెం: పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ లంచం తీసుకుంటుండగా ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నెల రోజులు గడవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. పాల్వంచ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా‌ విధులు నిర్వహిస్తున్న ఆల్బర్ట్.. ఓ కాంట్రాక్టర్‌ను లంచం అడిగాడు. శ్మశాన వాటిక పనుల బిల్లు చెల్లించుట కోసం రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దిక్కుతోచని స్థితిలో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇక పథకం ప్రకారం సరిగ్గా డబ్బులు తీసుకుంటుండగానే అధికారులు కార్యాలయంపై దాడులు చేసి.. ఎంపీడీవో ఆల్బర్ట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..