వైజాగ్ స్టీల్‌పై పోరు ఆగదు.. వెనక్కి తగ్గం : విజయసాయి రెడ్డి

by  |
వైజాగ్ స్టీల్‌పై పోరు ఆగదు.. వెనక్కి తగ్గం : విజయసాయి రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణలో భాగంగా ఏపీ అధికార పార్టీ కొత్త ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిపక్షాలకు, విమర్శలకు చెక్ పెట్టనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్‌ను ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుంచి, ఏపీలో ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదం మరోసారి జోరందుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని అడ్డంపెట్టుకోని జనంలో మైలేజ్ పొందాలని భావించారు. కానీ, దానికి తూట్లు పొడుస్తు వైపీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు పిలుపునిచ్చారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం శనివారం ఉదయం ప్రారంభించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, ఇందులో మంత్రులు కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. అంతకుముందు, వీరంతా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని విజయసాయి తెలిపారు. వైజాగ్ స్టీల్‌ను ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంట్ లోపల, బయల ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. గాంధీ విగ్రహానికి నివాళితో మరో ఉద్యమానికి నాంది పలికామన్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరినీ ప్రైవేటీకరించొద్దని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసినట్లు వివరించారు. మంత్రి అవంతి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుపై తమ స్టాండ్‌ను తెలిపేందుకే ఈ యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. 32 మంది త్యాగాల ఫలితమే వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ అని.. దీనిని కాపాడుకునేందుకు ఎలాగైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని వెల్లడించారు.



Next Story

Most Viewed