పోలేపల్లి ఎలమ్మపై ఒట్టేస్తవా.. కేటీఆర్​కు రేవంత్​ సవాల్​

112

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కొడంగల్ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం ఘాటు ట్వీట్ చేశారు. కొడంగల్ అభివృద్ధైనా, ఆత్మగౌరవమైనా తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే (2009-2018) జరిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘నా’టి పథకాలు అంటూ ‘నా’ అనే అక్షరాన్ని ప్రత్యేకించి చెబుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అవే పథకాలకు రంగులు వేసి ‘గుమస్తా తెలంగాణ’ రాసిన రాతలు పచ్చి అబద్ధాలంటూ జీవోలతో సహా పోస్ట్ చేశారు. ‘నీ దత్తతలో (జనవరి 2019 తర్వాత) ఒక్క పథకమైనా వచ్చినట్టు పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి ఆధారం (జీవో) చూపగలవా కేటీఆర్’ అంటూ ట్విట్టర్​లో సవాల్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..