- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్కీమ్ రద్దు చేయండి.. సీఎం జగన్‌కు ఎంపీ రఘరామ లేఖ
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రఘురామ గురువారం ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరో లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సమయంలో సీపీఎస్ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేయాలని కోరారు. పాత […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రఘురామ గురువారం ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరో లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సమయంలో సీపీఎస్ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేయాలని కోరారు.
పాత విధానాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చినందునే ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏడు రోజుల్లోనే ఈ హామీ నెరవేరుస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ హామీని నిలబెట్టుకోవాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రఘురామ లేఖలో కోరారు.
Next Story






