- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాతృత్వం చాటుకున్న ఎంపీ నామా.. ఏకంగా మూడు లక్షలు..
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన పిల్ల అన్నవరం అనే వ్యక్తి కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో ఈ విషయాన్ని అశ్వారావుపేట మండల నాయకులు ఎంపీ నామా దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని గుండె ఆపరేషన్ కు అవసరమయ్యే రూ. మూడు లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి అందేలా కృషి చేశారు. ఇందుకు సంబంధించిన ఎల్ఓసీ కాపీని బాధితుడి కుటుంబ […]</p>

దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన పిల్ల అన్నవరం అనే వ్యక్తి కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో ఈ విషయాన్ని అశ్వారావుపేట మండల నాయకులు ఎంపీ నామా దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని గుండె ఆపరేషన్ కు అవసరమయ్యే రూ. మూడు లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి అందేలా కృషి చేశారు.
ఇందుకు సంబంధించిన ఎల్ఓసీ కాపీని బాధితుడి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఎంపీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ముల్కలపల్లి ఎంపీపీ మట్లా నాగమణి, టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ, చిత్తారు సింహాద్రి యాదవ్, కనకమేడల సత్యనారాయణ, లగడపాటి రమేశ్, నామ సేవా సమితి జిల్లా అధ్యక్షులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, భార్గవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.






