- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్ముకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
by Shyam |
<p>దిశ నకిరేకల్: నన్ను నమ్ముకొని నా వెంటే ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన యూత్ కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి కిషన్, మాజీ ఉప సర్పంచ్ ముంత సత్తయ్య కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. మృతి చెందిన నాయకులకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు చెరో రెండు లక్షల చొప్పున నాలుగు లక్షల […]</p>

X
దిశ నకిరేకల్: నన్ను నమ్ముకొని నా వెంటే ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన యూత్ కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి కిషన్, మాజీ ఉప సర్పంచ్ ముంత సత్తయ్య కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. మృతి చెందిన నాయకులకు నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు చెరో రెండు లక్షల చొప్పున నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికితోడు వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు భూషయ్య, ఉషయ్య గౌడ్, తదితరులు ఉన్నారు.
Next Story






