- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌పై లోక్‌సభ స్పీకర్‌కు కంప్లైంట్ చేస్తా : కోమటిరెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. డంపింగ్ యార్డు, రోడ్డు సమస్యలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తాననే తనను ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలను పిలవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతీ కార్యక్రమంలో ఇదే విధంగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక పార్లమెంట్ సభ్యుడైన తనను పిలవకపోవడం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. డంపింగ్ యార్డు, రోడ్డు సమస్యలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తాననే తనను ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలను పిలవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతీ కార్యక్రమంలో ఇదే విధంగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక పార్లమెంట్ సభ్యుడైన తనను పిలవకపోవడం ఏంటని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా అని హెచ్చరించారు.
Next Story






