- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కలిశారు. భువనగిరిలో పర్యాటక అభివృద్ధి అంశాలపై కిషన్ రెడ్డితో చర్చించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అంతకముందు పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. తెలుగు వారికి, దేశానికి పేరు తెచ్చేలా పనిచేయాలని కిషన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపైన […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కలిశారు. భువనగిరిలో పర్యాటక అభివృద్ధి అంశాలపై కిషన్ రెడ్డితో చర్చించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అంతకముందు పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. తెలుగు వారికి, దేశానికి పేరు తెచ్చేలా పనిచేయాలని కిషన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపైన కిషన్ రెడ్డితో చర్చించానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరివరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.






