- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మోసకారి కేసీఆర్ ఆ మూడు నియోజకవర్గాలకే సీఎం’
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ మాయ మాటలతో మోసం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆలేరు నియోజకవర్గం జీడికల్ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మాటలతో మోసం చేయడం సీఎంకు తగదన్నారు. తరచు యాదాద్రి […]</p>

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ మాయ మాటలతో మోసం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆలేరు నియోజకవర్గం జీడికల్ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మాటలతో మోసం చేయడం సీఎంకు తగదన్నారు. తరచు యాదాద్రి గుట్టకు వస్తున్న ఒక్కసారి కూడా కిందనున్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని యాదగిరి గుట్ట, ఆలేరు, భువనగిరి పట్టణాలు కేసీఆర్ దయతో అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయని తెలిపారు.
కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని నిధులు మొత్తం ఈ మూడు నియోజరవర్గాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గంధమల్ల రిజర్వాయర్ కు త్వరగా పూర్తిచేస్తానని చెప్పి ఇప్పుడు అసలు రిజర్వాయర్‌ను రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. దీని వల్ల వేల ఎకరాలు బీడు వారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను కలుపుకుని త్వరలోనే గంధమల్ల ప్రాజెక్ట్ కొరకు పాదయాత్ర చేపడుతామని స్పష్టం చేశారు. ఆలేరు నియోజకవర్గం ఎడారిగా మారుతున్న స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
హుజురాబాద్ ఎన్నికల కోసమే 50 వేల ఉద్యోగాలు అంటూ కేసీఆర్ మరోమారు మోసం చేస్తున్నారని విమర్శించారు. హుజుర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఇలా ఏ ఎన్నికలు జరిగిన 50వేల ఉద్యోగాలంటూ యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఇంత ఇంగితజ్ఞానం లేని వారు మంత్రివర్గంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి హమాలీ పని చేసుకోవాలని చెప్పడం వారి సంస్కారాన్ని, తెలివిని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. హమాలీ పని చేసేందుకయితే లక్షలు పెట్టి ఉన్నత చదువులు చదవడం ఎందుకనీ ప్రశ్నించారు. వెంటనే యువతకు క్షమాపణలు చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
జీడికల్ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే చాలా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. జాతీయ రహదారుల అథారిటీ చైర్మన్‌ను పలుమార్లు కలిసి ఈ అండర్ పాస్ బ్రిడ్జిని మంజూరు చేయించినట్లు వెల్లడించారు. కరోనా కాలంగా ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ బ్రిడ్జి పనులు మరో నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని వివరించారు. అలాగే వంగపల్లి వద్ద అధికంగా రద్దీ ఉండడంతో అక్కడ అండర్ పాస్ బ్రిడ్జికి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని జాతీయ రహదారుల అథారిటీ అధికారులను ఆదేశించారు. డీపీఆర్ ఇస్తే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి, అథారిటీ ఉన్నతాధికారులను కలిసి నిధులు మంజూరు చేయిస్తానని కోమటిరెడ్డి తెలిపారు.






