కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టింది

by  |
కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పెడచెవిన పెట్టిందని ఎంపీ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావల్సిన నిధులు, హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. కృష్ణానది జలాల వివాదాన్ని తేల్చట్లేదని, సాగు విస్తీర్ణంలో 24శాతం పెరిగినా అందుకు తగ్గట్టు యూరియాను సరఫరా చేయట్లేదని విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్నా నూతన విద్యుత్ చట్టంను వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.

జాతీయ రహదారుల విస్తరణపై కూడా కేంద్రం మాట తప్పిందని, ఇంతటి మోసపూరిత ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. తెలంగాణకు 22నవోదయ పాఠశాలలు రావల్సి ఉన్నా స్పందించట్లేదన్నారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోందని, రాష్ట్రానికి రావల్సిన రూ.10వేల కోట్లను ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed