- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేంద్రం దగ్గర ఇబ్బందులు తప్పవు.. జగన్ ప్రభుత్వానికి జీవీఎల్ హెచ్చరిక

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. రాజకీయం, ఆర్థిక స్థితిగతులపై నేతలు చర్చించారు.
ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ‘షెకావత్ మాటలపై రాజకీయం చేస్తారా? జరిగిన తప్పు తెలుసుకోకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతారా? ఇది సిగ్గుచేటు.. తప్పుడు రాజకీయ సంస్కృతి.. జగన్ ఇప్పటికైనా మంత్రులను హెచ్చరించాలి.. లేదంటే కేంద్రం దగ్గర ఇబ్బందులు తప్పవు’ అని జీవీఎల్ హెచ్చరించారు. షెకావత్ దగ్గరికి 10 రోజులకోసారి వెళ్తారని, మీ మాటలన్నీ ఆయనకు తెలుస్తాయన్నారు. మళ్లీ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని జీవీఎల్ సూచించారు.
Next Story