- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్‌కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేయండి : బండి
<p>దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మనిష్ కుమార్ మాండవ్యను కలిసి కోరినట్లు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువైన కరీంనగర్‌కు నిత్యం వందలాది మంది వైద్య చికిత్సలకు వస్తుండగా సక్రమంగా వైద్యం అందటం లేదని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు. అలాగే, కరోనా మహమ్మారి […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మనిష్ కుమార్ మాండవ్యను కలిసి కోరినట్లు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువైన కరీంనగర్‌కు నిత్యం వందలాది మంది వైద్య చికిత్సలకు వస్తుండగా సక్రమంగా వైద్యం అందటం లేదని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు.
అలాగే, కరోనా మహమ్మారి దృష్టిలో పెట్టుకుని పేద రోగుల ప్రయోజనార్థం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కాన్, హుజూరాబాద్ ఆసుపత్రికి సీటీ స్కాన్‌ను తక్షణమే మంజూరు చేయాలని కోరినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






