- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెల్త్ బులిటెన్ విడుదలకు ఎంపీ బండి సంజయ్ డిమాండ్
<p>దిశ, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులపై స్పష్టమైన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్రనికి వచ్చిన వారి లెక్కలు బయటకు చెప్పాలన్నారు. ఎంత మంది వచ్చారో స్పష్టమైన సంఖ్య ఇవ్వడానికి ప్రభుత్వం ఎవరి మెప్పుకోసం భయపడుతుందో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు ఏఏ జిల్లాలో ఎన్ని నమోదయ్యాయో తెలియజేస్తే అక్కడి ప్రజలు […]</p>

దిశ, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులపై స్పష్టమైన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్రనికి వచ్చిన వారి లెక్కలు బయటకు చెప్పాలన్నారు. ఎంత మంది వచ్చారో స్పష్టమైన సంఖ్య ఇవ్వడానికి ప్రభుత్వం ఎవరి మెప్పుకోసం భయపడుతుందో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు ఏఏ జిల్లాలో ఎన్ని నమోదయ్యాయో తెలియజేస్తే అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉంటారని సంజయ్ అన్నారు. ఆరోగ్య శాఖ ఇచ్చే హెల్త్ బులిటెన్ కు, సీఎంవో ఇచ్చే కరోనా లెక్కలకు సంబంధం ఉండటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఆరోగ్య శాఖను నమ్మాలో లేదోనన్న సందిగ్ధంలో పడిపోయారని, గంట వ్యవధిలోనే సీఎంవో అధికారిక ప్రకటనకు, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌కు పొంతన ఉండటం లేదన్నారు. ఇప్పటికైనా కరోనాపై స్పష్టమైన హెల్త్ బులిటెన్ ఆరోగ్య శాఖ నుంచి విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Tags: release health bulletin, demand bandi sanjay, karimnagar, ts govt






