నీటిలోనే ధాన్యం.. రైతులకు వణికిస్తున్న వర్షాలు

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలుకు పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, తద్వారా ధాన్యమంతా అకాల వర్షంతో నీళ్ల పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచనలుండటంతో రైతులు వణికిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తడవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద రైతును అని చెప్పుకుంటున్న సీఎం [&hellip;]</p>

నీటిలోనే ధాన్యం.. రైతులకు వణికిస్తున్న వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలుకు పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, తద్వారా ధాన్యమంతా అకాల వర్షంతో నీళ్ల పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచనలుండటంతో రైతులు వణికిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తడవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద రైతును అని చెప్పుకుంటున్న సీఎం కు ఈ రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బండి పేర్కొన్నారు. తాలు పేరుతో రైతునునిలువునా దోచేస్తున్నారని మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనే విషయంలో ప్రణాళిక కొరవడిందని ఆయన విమర్శలు గుప్పించారు. ఎంత ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనా వ్యవసాయ శాఖలో లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. రైతులు కరోనాతో సావాసం చేస్తూ కల్లాల వద్దే వారాల తరబడి రైతుల నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయ లోపంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రతి ఏటా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మేల్కొనడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొట్టుకుపోతోంది..

అకాల వర్షాలు సర్వసాధారణమన్న బండి సంజయ్ అందుకు అనుగుణంగా రైతుకు నష్టం వాటిల్లకుండా సరిపడ టార్పాలిన్లు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యమంతా వర్షానికి కొట్టుకుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ కాలనీ, నగునూరు, చిగురుమామిడి కల్లాల్లో వర్షానికి ధాన్యం వాన నీటిలో కొట్టుకుపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంచిర్యాల జిల్లాలోని లక్షట్టిపేట, దండేపల్లిలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే ఆ రైతుల ఏడుపులు సీఎం కేసీఆర్ కు వినిపించలేదా అని సంజయ్ ప్రశ్నించారు. కల్లంలో పోసిన ధాన్యం వానకు తడిసిపోవడంతో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటకు చెందిన రైతు భూమయ్య గతనెల 21నగుండెపోటుతో మరణించాడని, రైతుల చావులు కేసీఆర్ కు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.

దుబ్బాక వ్యవసాయ మార్కెట్లోనే ధాన్యం పోసి, తూకం కాకపోవడంతో మూడు రోజులుగా నిరీక్షిస్తున్న ధర్మాజిపేటకు చెందిన రైతు పరుశురాములు వడదెబ్బతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంటా చేసి ఆతడిని ఇంటికి పంపిస్తే బతికేవాడు కదా అని పేర్కొన్నారు. ఇక తాలు పేరుతో మిల్లర్లు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తుంటే వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఏఈవోలు సర్టిఫై చేశాక కూడా మిల్లర్లు కిలోల చొప్పున తాలును కట్ చేయడం అన్యాయమన్నారు. యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 6,477 కొనుగోలు కేంద్రాలు పెట్టామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం 5 వేల కేంద్రాలు కూడా పెట్టలేదని గుర్తుచేశారు. వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story