- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ శ్రేణులకు, కలెక్టర్లకు ఎంపీ బండి సంజయ్ కీలక ఆదేశాలు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతిలను కోరారు. మంగళవారం ఆయన కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల పట్టణాల్లో ముంపునకు గురైన కాలనీలు, బస్తీల పరిస్థితిపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి వర్షాలకే కాలనీలు ముంపునకు గురవడంపై బండి సంజయ్ ఆందోళన వ్యక్తం […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతిలను కోరారు. మంగళవారం ఆయన కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల పట్టణాల్లో ముంపునకు గురైన కాలనీలు, బస్తీల పరిస్థితిపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి వర్షాలకే కాలనీలు ముంపునకు గురవడంపై బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు తక్షణమే రంగంలోకి దిగాలని కోరారు. పార్టీ కేడర్ అంతా కూడా వరద బాధిత ప్రాంతాల్లోని వారికి అన్ని రకాలుగా సాయం అందించాలని పిలుపునిచ్చారు.
Next Story






