మేయర్ పదవిపై ఎంఐఎం కీలక నిర్ణయం!

905

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశ మిగిల్చాయి. 55 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా మేయర్ పీఠం దక్కాలంటే స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో మిత్ర పక్షం ఎంఐఎం సపోర్టు తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మేయర్ పదవి మద్దతుపై ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు.

కాగా, టీఆర్ఎస్‌కు మేయర్ పదవి ఇస్తే, ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్, లేదా చెరో రెండున్నర సంవత్సరాలు మేయర్ పదవి అధిష్టించాలని ఎంఐఎం అధినేత అసద్ అధికారపార్టీ ఎదుట ప్రపోసల్ పెట్టాలని చూస్తున్నట్లు పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..