5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు: ఎంపీ అర్వింద్

54

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీగా గెలిచిన 5రోజులకు నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదని, అదేవిధంగా పసుపు రైతులకు రూ.15వేల చొప్పున ఇస్తానన్న విషయం సైతం నేను అనలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. శనివారం నిజామాబాద్‌లో రైతులతో సమావేశమైన ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు బోర్డు తెస్తానని మాత్రమే బాండ్‌లో రాశానని, ఎన్నికల హామీలు నెరవర్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు రైతుల మేలు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపానని, పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థ తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని నిజామాబాద్‌లో స్పెసెస్ రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. టర్మరిక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ రిపోర్టు ఆధారంగా నిజామాబాద్‌ను టర్మరిక్ ఫోర్ట్ హబ్‌గా మార్చామని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..