- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన పార్టీలోకి యూట్యూబ్ స్టార్ హర్ష సాయి..?
by samatah |
హర్ష సాయి అనగానే అందరికీ తెలియకపోవచ్చు కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కోట్లాది మంది మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, సేవా గుణంతో కోట్లాది

X
దిశ, సినిమా: హర్ష సాయి అనగానే అందరికీ తెలియకపోవచ్చు కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కోట్లాది మంది మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, సేవా గుణంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాను సాయం చేస్తున్న వీడియోలను, ఆ సాయాన్ని పొందిన పేదోళ్ల ఆనందాన్ని వీడియోల రూపంలో రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు హర్ష సాయి. అతని సేవాగుణం చూసి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో మిలియన్ల కొద్ది సబ్స్‌స్క్రైబర్స్ రావడంతో సంపాదన విపరీతంగా పెరిగింది. ఇక ఎక్కడ ఆపద ఉంటే అక్కడ వాలిపోయే హర్ష సాయి.. ఇప్పుడు జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అంతేకాదు ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






