నాని చేతుల మీదుగా యూత్‌ఫుల్ ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్ రిలీజ్

by Disha Web Desk 6 |
నాని చేతుల మీదుగా యూత్‌ఫుల్ ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్ రిలీజ్
X

దిశ, సినిమా: సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘మేమ్ ఫేమస్’. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా తాజాగా నేచురల్ స్టార్ నాని థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలంగాణ యాసలో హీరో చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం కాగా.. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల , మౌర్య చౌదరి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారు ఎప్పుడూ గ్రామంలో ఇతరులతో గొడవలు పడుతున్నట్లుగా కనిపించారు. అయితే ఎలా అయిన సరే ఫేమస్ అవ్వాలని, అప్పుడే తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పెళ్లి జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్న ఇద్దరు.. గొడవల వల్లనే ఫేమస్ అవుతామని నమ్ముతారు. ఈ క్రమంలో ఫన్ ఏర్పడినా.. చివరకు ఏం జరిగింది? అనేది కథ. కాగా మూవీ ఈ నెల 26న విడుదల కానుంది.

Also Read..

Virupaksha : రూ. 100 కోట్ల క్లబ్‌లో ‘విరూపాక్ష’

Next Story

Most Viewed