- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Young Tiger NTR: ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్‌ని చూశారా? సింపుల్‌గా ఉన్న కాస్ట్ మాత్రం కోట్లలోనే..
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘దేవర’ మూవీతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. కాగా ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనుండగా ఇప్పటికే మొదటి భాగం దాదాపు పూర్తయినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ సంబంధించిన ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. దేవర మూవీ షూటింగ్ పూర్తి కాకముందే కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడు. అందులో భాగంగా శుక్రవారం (ఆగస్టు 08) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఎన్టీఆర్- నీల్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇదే వేడుకలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌తో పాటు.. తారక్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దీని ధర ఎంత ఉంటుందబ్బా? అంటూ నెటిజన్లు గూగుల్ తల్లిని ఆశ్రయించారు. అక్కడ ఆ వాచ్ రేటు చూసిన వారందరూ అవాక్కవుతున్నారు.
ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ స్విట్జర్లాండ్‌కు చెందిన పాటక్ ఫిలిప్ అనే లగ్జరీ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తోంది. బయట చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ, దీని ఖరీదు సుమారు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. ఇదే కాదు ఈ బ్రాండ్‌లో లభించే వాచ్‌లన్నీ కోట్ల రూపాయలు విలువ చేస్తాయట. కాగా గతంలో కూడా ఒక ఫంక్షన్‌కు ఇదే వాచ్‌తో హాజరయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.