- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజంతా అదే పని చేసి అలసి పోయేదాన్ని.. నిద్ర కూడా ఉండేది కాదు.. తట్టుకోలేకపోయానంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి బనితా సంధు(Banita Sandhu) మోడల్‌గా పరిచయం అయి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి బనితా సంధు(Banita Sandhu) మోడల్‌గా పరిచయం అయి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఓ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అడివిశేష్ సనసన ‘గూఢచారి-2’లో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఆమె నటించిన ‘డిటెక్టివ్ షెర్డిల్’(Detective Sherdil) మూవీ జీ5లోకి రాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బనితా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘బాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని విషయాల్లో ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఊహించని దానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటల పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకునే వారు రాత్రికి ఇంటికి పంపించేవాళ్లు. ఒక్కోసారి సరైన నిద్ర కూడా ఉండేది కాదు. ఒక్కోసారి 24గంటల పాటు మేల్కొనే ఉండేదాన్ని. అప్పుడు నేను.. నా కోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. దీంతో నాకు చాలా కోపం వచ్చింది.
ఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలతో వాదన పెట్టుకున్నాను. బహుశా అందుకేనేమో నన్ను అందరూ కలిసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అయినా అవన్నీ అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా ఆదిత్య వర్మ చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటి దానికి హీరో ఎలా పడిపోయాడని దారుణంగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే ఫస్ట్ టైమ్. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి నాకు ఆపర్స్ వచ్చాయి. ఆ సమయంలో నేను భారతదేశానికి వెళ్లి ఉంటే నేను చాలా రిచ్‌గా ఉండేదాన్ని. అక్టోబర్ తర్వాత మేము మిమ్మల్ని ఫలానా సినిమాలో నటించాలని కోరుకుంటున్నామని చాలా మంది నిర్మాతలు నాకు చెప్పారు’’ అని చెప్పుకొచ్చింది.






