మగవాడి తోడు అవసరం లేదు.. అండాలు భద్రపరుకున్నానంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-23 14:21:20  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ డైసీ షా (Daisy Shaw) ‘తేరే నామ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

మగవాడి తోడు అవసరం లేదు.. అండాలు భద్రపరుకున్నానంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ డైసీ షా (Daisy Shaw) ‘తేరే నామ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరగా ‘మిస్టరీ ఆఫ్ ది టాటూ’ (Mystery of the Tattoo)మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఈ అమ్మడు పెళ్లిపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఓ వ్యక్తితో చాలా ఏళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నన్ను చాలా టార్చర్ చేశాడు. అతను వేరే అమ్మాయిలతో క్లోజ్‌గా ఉంటూ.. నాకు మాత్రం కండీషన్లు పెట్టేవాడు. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు.

దానివల్ల నేను మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. ఏడేళ్ల తర్వాత సంతోషంగా లేనని బ్రేకప్ చెప్పాను. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు.అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. నా పోషణ కోసం నాకు ఒక మగవాడి తోడు అవసరం లేదు. అందుకే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరుచుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story