- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్క కాటు పెద్ద విషయమే కాదంటూ యంగ్ హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
బ్రోచేవారెవరురా, చిత్రలహరి(Chitralahari), అలా వైకుంఠపురంలో(Ala Vaikunthapurramuloo) వంటి చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లో ప్రత్యేక క్రేజ్‌ను రాబట్టుకుంది.

దిశ, సినిమా: బ్రోచేవారెవరురా, చిత్రలహరి(Chitralahari), అలా వైకుంఠపురంలో(Ala Vaikunthapurramuloo) వంటి చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లో ప్రత్యేక క్రేజ్‌ను రాబట్టుకుంది. కానీ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల తన ప్రియుడిని పరిచయం చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది. సినిమాలకు దూరం అయినప్పటికీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మూగ జీవాల కోసం పోరాటం చేస్తోంది. వీధి కుక్కల సంరక్షణ కోసం చేసే ర్యాలీల్లో పాల్గొంటుంది. ఈక్రమంలోనే.. తాజాగా, నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj)వివాదాస్పద కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కొంటుంది.
‘‘చాలామంది కుక్కకాటును భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కానీ అదేమంత పెద్ద విషయం కాదు. కుక్క కాటుని మనం పెద్దదిగా చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించకూడదు. మన కళ్లముందే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి ఒక్కరూ మాట్లాడరు. కానీ కుక్క కరిస్తే మాత్రం దానిని పెద్ద ఇష్యూ చేస్తారు. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ చాలా ప్రమాదకర వ్యాధి కానీ భయాన్ని వ్యాప్తి చేసే బదులు.. పరిష్కారం ఏంటో నేర్పించాలి. అంతేకానీ వీధి కుక్కలను చంపడం ఈ సమస్యకు పరిష్కారం కాదు’’ అని చెప్పుకొచ్చింది.
గత కొద్ది రోజులుగా ఎంతో మంది చిన్నారులు కుక్క కాటుతో చనిపోయారు. అలాగే మరికొందరిపై అతి కిరాతకంగా వీధి దాడి చేశాయి. ఇలాంటి సంఘటనలెన్నో దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో నివేదా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నువ్వు కారులో కాకుండా రోడ్ మీద నడిస్తే కుక్క కాటు ఏంటో అర్థం అవుతుంది. ఏసీ కారులో తిరుగుతూ ప్రజలకు హాని చేస్తే విషయంపై ఇలా మాట్లాడటం సరికాదని దుమ్మెత్తిపోస్తున్నారు.






