- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ హీరోయిన్ బర్త్ డే స్పెషల్.. ‘విశ్వంభర’ మూవీ నుంచి గార్జియస్ లుక్ విడుదల
యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) ‘నా స్వామి రంగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) ‘నా స్వామి రంగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఒక్క మూవీతోనే అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస అవకాశాలు అందుకున్న ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఖైదీ-2(Kaithi-2), విశ్వంభర(Vishvambhara) వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో మూవీ మేకర్స్ అషికా రంగనాథ్‌కు విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఈ అమ్మడు ఆరెంజ్ కలర్ చీరలో గార్జియస్ లుక్‌తో కనిపించి అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను ఫిదా అయ్యేలా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాగా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తుంగా.. త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో అషికా కీలక పాత్రలో కనిపించనుంది.
సోసియో ఫాంటసీ చిత్రంగా రాబోతుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి, వి వంశీ కృష్టా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతుండటంతో మెగా ఫ్యాన్స్ అంతా నిరాశ చెందుతున్నారు. కానీ టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు ‘విశ్వంభర’ మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.






